Site icon NTV Telugu

Peddapalli: ఫేస్ బుక్ పరిచయం.. ప్రేమగా మారి.. ఇంట్లో కలిసి ఉండగా..

Peddapally

Peddapally

పెళ్లి కాని యువతీ యువకులే కాదు.. పెళ్లైన వారు కూడా ప్రేమ పేరుతో కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత పెరిగింది. ఫేస్ బుక్, ఇన్ స్టా పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇద్దరు వివాహితులు ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు ప్రియుడు ప్రియురాలు.

Also Read:Surveen Chawla : ఆ డైరెక్టర్ లాగి ముద్దు పెట్టబోయాడు.. ‘రానా నాయుడు’ నటి ఆరోపణలు..

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లల తల్లి. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత అది అక్రమసంబంధానికి దారితీసింది. కొంతకాలంగా వీరి వ్యవహారం గుట్టుగా సాగుతోంది. ఎంత తెలివిగా తప్పించుకు తిరిగినా ఏదో ఓ రోజు పట్టుబడకుండ ఉండలేరు కదా.

Also Read:India Turkey: టర్కీకి భారత్ మరో దెబ్బ… టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం రద్దు.. ఇండిగోకు కీలక ఆదేశాలు

అదే విధంగా అశోక్ నగర్ లో వీరిద్దరు ఇంట్లో కలిసి ఉండగా కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కలిసి పట్టుకున్నారు. ఆ తర్వాత వారిద్దర్ని తాడుతో బోరింగుకు కట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని ప్రియుడు, ప్రియురాలికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Exit mobile version