Collectors Conference: కలెక్టర్ల కాన్ఫరెన్స్ తాజా తేదీలు ఇవే.. దిశానిర్దేశం చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం
- మారిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ తేదీలు..
- ఈ నెల 11, 12 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్..
- దిశానిర్ధేశం చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collectors Conference: ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చసి ఆరు నెలలు పూర్తవుతోంది. అయితే, ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు.. తమ టార్గెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తోన్న కూటమి ప్రభుత్వం.. మరిన్ని భవిష్యత్ లక్ష్యాలను ఫిక్స్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే కాగా.. మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది..
Read Also: Jaggareddy: సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వివిధ శాఖల వారీగా కాన్ఫరెన్స్‌లో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.. ఇక, రెండో రోజు ముగింపు సమయంలోనూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆరు నెలల పాలన పూర్తవుతున్న వేళ.. కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.. ఈ సారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలను సిద్ధం అవుతున్నారట.. ఈ సారి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట.. వీటి అమలుపైనా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖల్లో ఈ 6 నెలల కాలంలో వచ్చిన మార్పు.. తీసుకురావాల్సిన మార్పుల పైన చర్చించి కీలక సూచనలు చేయనున్నారు. వ్యవసాయం, నీటి పారుదల అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారట.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా.. భూముల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో భూ రికార్డుల పరిశీలన.. ఫిర్యాదుల పరిష్కారంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు..
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!