NTV Telugu Site icon

Rooster Fight: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు.. లక్షల్లో బెట్టింగ్, చేతులు మారుతున్న కోట్లు

Cock Fights

Cock Fights

Rooster Fight: ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి. హైటెక్‌ అంగులతో కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్ల హడావుడితో కోడి పందాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 782 పందెం బర్లు ఉంటాయని అనధికార లెక్కలు చెబుతున్నాయి.

340కు పైగా పెద్ద బరులు ఉంటాయని అంచనా. లక్షల్లో పందాలు వేస్తుండగా.. కోట్లాది రూపాయలుచేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో సుమారు రూ. 100 వంద కోట్లు చేతులు మారినట్టు అంచనా.అసలు పందాలకు పోటా పోటీగా పైపందాలు జరుగుతున్నాయి. బరిలో అసలు పందాలు జరగుతుండగా.. బరి బయట పైపందాలు జరుగుతున్నాయి. పైపందాల్లోనే సుమారు రూ. 40 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. పందాలు చూడడానికి వచ్చిన సందర్శకులు వాళ్లల్లో వాళ్లే పందాలు కట్టుకుంటున్నారు. రూ. 10 వేల నుంచి 10 లక్షల వరకు అసలు పందాలు జరుగుతుండగా.. రూ. 500 నుంచి 10 వేల వరకు పై పందాలు జరుగుతున్నట్లు తెలిసింది. రాత్రి పది గంటల వరకు కోళ్ల పందాలు నిర్వహించేలా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

Read Also: Kodi Pandalu: వెయ్యి కట్టు.. బైక్ పట్టు.. పందెం బరుల వద్ద కూపన్ల ఆఫర్లు

సంవత్సరమంతా బలమైన ఆహారంతో మేపిన కోడి పుంజులను పందెంరాయుళ్లు బరిలోకి దింపుతున్నారు. కోత పందాలతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థి పుంజులను ఢీకొట్టేందుకు బాదం, పిస్తా, వివిధ మెడిసన్లతో పాటు ఆర్మీ సైనికుడికి ఇచ్చిన శిక్షణ మాదిరి ఈత కొట్టించడం, ఇతర శిక్షణ ఇచ్చి కోళ్లను బరిలో దింపుతున్నారు పందెంరాయుళ్లు. ఇక బరుల వద్ద సందడి నెలకొంది. కోడి పందాలు చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. కోడిపందాలతో పాటు పక్కనే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోడి పందాలు చట్టరీత్యా నేరమైన రాజకీయ అండదండలతో ఏటా పండుగ మూడు రోజులు నిర్వహించడ ఆనవాయితీగా మారింది. సంప్రదాయంలో భాగంగా కోడి పందాలు అడుతున్నామని పందెంరాయుళ్లు వాదించడం ఇందులో కొసమెరుపు.

Show comments