NTV Telugu Site icon

CM YS Jagan: 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?

Ap Cm Jagan

Ap Cm Jagan

CM YS Jagan: జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. “కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?.. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?.. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?.. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. -సీఎం జగన్. ఇంటి వద్దకే పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?” అంటూ సీఎం జగన్‌ చంద్రబాబును ప్రశ్నించారు. నెల్లూరులో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. డిజిటల్‌ క్లాసులు, లైబ్రరీలు చంద్రబాబుకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. వెలిగొండ, శ్రీశైలం నుంచి నీళ్లు రాక ఫ్లోరైడ్‌తో జనం ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వెలిగొండలో రెండు టన్నెళ్లు పూర్తి చేశామన్నారు. ప్రకాశం జిల్లాకు నీళ్లు తరలిస్తామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు.

Read Also: Ap Bjp: ఏపీపై బీజేపీ ఫోకస్.. రేపు హోంమంత్రి, 6,8న ప్రధాని రాక

అభివృద్ధి ఎవరు చేశారో నెల్లూరు నుంచి చెబుదామన్నారు సీఎం జగన్. నెల్లూరు జిల్లాలో రామయ్య పట్నం పోర్టు పనులు దాదాపు పూర్తికావస్తున్నాయని.. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. ఇదంతా కళ్ల ఎదుట కనిపిస్తున్న అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టామని.. టోఫెల్ పరీక్షలకు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను తీసుకువచ్చామని.. పేద పిల్లలకు బై జ్యూస్ కంటెంట్‌ను ప్రవేశ పెట్టామని.. పిల్లలకు తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఉన్న పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామన్నారు. ఇది సుస్థిర అభివృద్ధి కాదా అన్న ఆయన.. గ్రామ స్వరాజ్యానికి నాంది పలికామన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, వాలంటీర్లను నియమించామన్నారు. నాడు-నేడుతో ఆస్పత్రులలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబుకు కనపడటం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో పలువురు ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారని.. వెలుగొండ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ ను పూర్తి చేసి నీటిని ప్రకాశం కు తీసుకు వచ్చామన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌ల నిర్మాణం, గండికోట, చిత్రావతి ప్రాజెక్ట్‌లను మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామన్నారు.

Read Also: Tirumala Rain: తిరుమలలో వరుసగా మూడోరోజు కురుస్తున్న వర్షం

విమానాశ్రయాల విస్తరణలు కూడా చేపట్టామని.. భోగాపురం విమానాశ్రయ పనులు చేపట్టామన్నారు. ఇండస్ట్రియల్ నోడ్స్ పనులు కూడా జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో రాని పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టబడులు పెడుతున్నారని.. ఇది అభివృద్ధి కాదా అంటూ సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో 32 వేలకోట్ల. పెట్టుబడులు రాగా.. గత ఐదేళ్లలో లక్ష కోట్ల మేర వచ్చాయన్నారు. 2 లక్షల 70 వేల కోట్ల మేర నిధులను బటన్ నొక్కి ఇస్తున్నామని.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటూ సీఎం అన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేర్లపై ఇచ్చామని.. 20 లక్షల ఇళ్ళు కడుతున్నామన్నారు. ఇలాంటి అభివృద్ధి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతోందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తాను చేసిన పనులు చెప్పుకోలేక పొత్తులతో ఎన్నికలకు వస్తున్నాడని ఎద్దేవాచేశారు. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీ పార్టీతో చంద్రబాబు జతకట్టాడన్నారు. ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని సీఎం జగన్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని విమర్శించారు.

ఈ రిజర్వేషన్లపై రాజకీయం చేస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడటాం సరైనదేనా?.. మైనార్టీల మనోభావాలనుకు దెబ్బతీసే ఏ అంశానికి కూడా మద్దతు ఇవ్వనన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా వైసీపీనేనని.. 175 లో 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కేటాయించిందన్నారు. కులం..మతం.. రాజకీయాలు చూడకుండా పేదవాడిని పేదవాడిగా చూసి పథకాలు అందిస్తున్నామన్నారు. చేసిన మంచి చెబుతూ నలుగురిలో గర్వంగా నిలబడుతున్నామన్నారు. కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే అండగా నిలవమని కోరుతున్నానని.. చంద్రబాబు మేనిఫెస్టోలో మాయలు… మోసాలు..అబద్ధాలేనంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబుకు అధికారం వచ్చిన తర్వాత ఆయనలోని చంద్రముఖి బయటకి లేస్తుందన్నారు. 2014లో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి తో ఎన్నికలకు వచ్చి ఇంటింటికీ మేనిఫెస్టో పంపారని.. మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. “రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నారు..రైతుల రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నిస్తున్నా?.. పొదుపు సంఘాల ఋణాలు మాఫీ కాలేదు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 3 సెంట్ల స్థలం అన్నారు. ఒక సెంట్ అయినా ఇచ్చారా?. సింగపూర్‌కు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి పట్నంలోనూ హై టెక్ సిటీ నిర్మిస్తామన్నారు.. నిర్మించారా?. ఇలాంటి వారిని నమ్మవచ్చా? మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వచ్చారు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారు ..ప్రజలు నమ్ముతారా?.” అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.