CM Jagan: మండుటెండలో సైతం ఆత్మీయ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగనుందని.. ప్రతిపక్షం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని , దుష్ట చతుష్టయాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. మూకుమ్మడిగా కలిసి వచ్చి, మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారని.. మీకు మంచి చేసిన మీ బిడ్డపై పొత్తుల పార్టీలు యుద్ధం చేస్తున్నాయన్నారు. తాను నమ్ముకుంది పేద ప్రజల్ని, పైనున్న దేవుడ్ని అని సీఎం జగన్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని.. రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధి, పేద ప్రజల భవిష్యత్తుని, పేద ప్రజల తలరాతని నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇస్తున్న పథకాలన్నీ ముగిసిపోతాయని సీఎం అన్నారు.
Read Also: Janasena Symbol: కూటమికి గ్లాస్ గండం..ఫ్రీ సింబల్ జాబితాలో జనసేన గాజు గ్లాస్ గుర్తు
పేద ప్రజలు మోసపోతారని.. అందుకే ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండ శిలువ నోట్లో తలకాయి పెట్టడం లాంటిదేనన్నారు. తాను విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా, పేద ప్రజలకు మరింత మంచి చేయాలని తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాలని.. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేసిన నాయకులు ఉన్నారన్నారు. కానీ మీ బిడ్డ మాత్రం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి, పేద ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం, మీ బిడ్డదేనన్నారు. విశ్వసనీయత కలిగిన ప్రభుత్వానికి ఓటు వేయాలన్నారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు, పిల్లలందరికీ హీరో బచ్చాలాగానే కనిపిస్తాడన్నారు. చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను, ఇంటింటికి మంచి చేసి ఒక్కడినే ఎన్నికల బరిలో నిలబడ్డానన్నారు. బచ్చా అనుకుంటున్న ఈ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక, నువ్వు కలిసి వచ్చిన వాళ్ళందరితో పొత్తులు పెట్టుకున్నావన్నారు. నువ్వు చేసిన మంచి చెప్పి చంద్రబాబు ఓటు అడగాలన్నారు. ప్రజలకు ప్రతి ఇంట్లో మంచి జరిగి ఉంటే, మీరే సైనికులుగా మళ్లీ మన ప్రభుత్వాన్ని తీసుకురావాలని సీఎం జగన్ పేర్కొన్నారు.