CM YS Jagan: నాకు చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదు.. నేను లండన్‌లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా లేదన్న ఆయన.. చంద్రబాబు అనగానే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు, అబద్దాలు, వంచనలు అంటూ ఎద్దేవా చేశారు.. జగన్ ని చూస్తే సామాజిక న్యాయం, గ్రామాల్లో మారిన వైద్యం, విద్యా, ప్రాంతాల మధ్య సమానత్వం, మహిళలకు భద్రత, దిశా యాప్ ద్వారా 30 వేల మందిని కాపాడడం గుర్తుకు వస్తాయన్నారు.. మరోవైపు.. చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదన్నారు.. నాకు చంద్రబాబు పై ఎలాంటి కక్ష లేదన్న ఆయన.. నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు.
Read Also: Ariyana Glory : ఆంటీలాగా ఉన్నావంటు దారుణమైన ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అరియానా..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.. దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) బీజేపీతోనే ఉన్నాను అంటున్నాడు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా సగం రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వాళ్లే.. ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ అక్రమం ఎలా అవుతుంది.. చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతే అరెస్ట్‌కు కారణం అన్నారు జగన్.. చంద్రబాబు అవినీతిని పసిగట్టి సీబీఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి వచ్చాయి.. అందుకే చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వను అని తీర్మానం చేశాడని మండిపడ్డారు.. గజదొంగల ముఠా వీరప్పన్ .. బాబును సమర్ధించడం అంటే పేద వాడిని వ్యతిరేకించటమే అన్నారు.. చంద్రబాబును సమర్ధించడం అంటే నయా జమీందారి వ్యవస్థను సమర్థించటమే అంటూ ఘాటు వ్యాఖ్‌యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. కాగా, ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న విషయం విదితమే.. ఏపీ హైకోర్టులో చంద్రబాబు ఈ రోజు షాక్ తగిలింది.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!