NTV Telugu Site icon

CM YS Jagan: గ్రాఫ్ ఉంటేనే సీటు.. లేదంటే లేదు..!

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడప గండం పొంచి ఉంది. గడపగడపలో గ్రాఫ్ ఉంటేనే సీట్ ఇస్తామని… లేదంటే లేదని తేల్చిచెప్పేశారు సీఎం జగన్‌. గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై సుదీర్ఘంగా ప్రజంటేషన్‌ ఇచ్చారు. గడప గడప సమీక్షలో ప్రతిసారీ సీఎం జగన్‌ ఇదే చెప్తున్నా… కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవడం లేదు. ఇప్పటికీ 18మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని హెచ్చరించారు. సరిగా పని చేయని 18 మంది శాసనసభ్యులను…ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఎన్నికలకు 9 నెలలే ఉన్నందున ఇదే చివరి చివరి అవకాశమన్నారు. అక్టోబర్‌లోగా గడప గడప గ్రాఫ్ మెరుగుపర్చుకోని నేతలకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. టికెట్లు ఇచ్చే విషయంలో ఎలాంటి మెహమాటలు ఉండవని పార్టీ గెలుపే ముఖ్యమన్నారు సీఎం జగన్.

Read Also: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!

ప్రభుత్వం సంక్షేమ పథకాలు… ప్రజలకు చేసిన మంచి పనులు ఇంటింటికీ వెళ్లి చెప్పుకోవడమే గడప గడప కాన్సెప్ట్. జగన్ ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తామని.. అందులో మొహమాటాలు ఏమీ లేవని తేల్చేశారు సీఎం జగన్. సీట్ ఇవ్వలేని వారికి నామినేటెడ్ పదవులు మాత్రమే ఇవ్వగలమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మరో 9నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని నేతలతో సీఎం జగన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని చెప్పారు. ఎన్నికల్లో తప్పని సరిగా గెలిచేందుకు అంతా కష్టపడి పనిచేయాలన్నారు.