NTV Telugu Site icon

CM YS Jagan: ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం..

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. వైసీపీకి ఓటువేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. అందులో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్‌ మాట్లాడుతూ.. నిజం ఒకవైపు అబద్ధం ఒకవైపు ఉంది.. మంచి ఓవైపునా చెడు మరోవైపునా ఉంది.. ధర్మం ఒకవైపు.. అధర్మం మరోవైపు ఉన్నాయి.. మూడుసార్లు అధికారం ఉండి మోసం, అన్యాయం, చెడు, చీకటి ప్రజల రిటన్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు సీఎం జగన్‌..

Read Also: Medicine Prices: ఏప్రిల్ నుంచి మెడిసిన్ ధరల పెంపు అంతా ఉత్తదే.. కేంద్రం క్లారిటీ..

చంద్రబాబు సహా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినా పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో పాటు దత్తపుత్రుడు కలసి వైఎస్‌ జగన్ మీదా పోటికి వస్తున్నారని హెచ్చరించారు సీఎం జగన్‌.. చంద్రబాబు చేసినా అభివృద్ధి ఏంటి? జగన్ చేసిన అభివృద్ధి ఎంటో తెలుసుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మీమీ బ్యాంకు స్టేట్‌మెంట్‌ ఒకసారి చూసుకొండి.. ఎవరు ఎక్కవగా డబ్బులు వేశారు చూసుకోండి.. ఎవరి వల్ల ఎక్కువ లబ్ధి పొందారో చూసుకుని ఓటు వేయండి అని సూచించారు. ఇక, ఇంటికి వెళ్ళి పెన్షన్ లు ఇచ్చే వాలంటీర్లను పధకం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ తో లేకుండా చేయాలని చూశాడని విమర్శించారు. చంద్రబాబు మనిషి కాదు ఒక శాడిస్టు అంటూ మండిపడ్డారు. మళ్లీ జగన్ గెలిస్తేనే నేరుగా మీఇంటికి పథకాలు వస్తాయన్నారు సీఎం వైఎస్‌ జగన్.

Read Also: Rajiv Gandhi Case: 3 దశాబ్దాల తర్వాత నిందితులకు వీడ్కోలు

ఇక, మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా? ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం అన్నారు. పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించిన సీఎం జగన్‌.. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్‌.. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన లక్ష్యం అన్నారు. డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని సూచించారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Show comments