CM YS Jagan: ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. వైసీపీకి ఓటువేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. అందులో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. నిజం ఒకవైపు అబద్ధం ఒకవైపు ఉంది.. మంచి ఓవైపునా చెడు మరోవైపునా ఉంది.. ధర్మం ఒకవైపు.. అధర్మం మరోవైపు ఉన్నాయి.. మూడుసార్లు అధికారం ఉండి మోసం, అన్యాయం, చెడు, చీకటి ప్రజల రిటన్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు సీఎం జగన్..
Read Also: Medicine Prices: ఏప్రిల్ నుంచి మెడిసిన్ ధరల పెంపు అంతా ఉత్తదే.. కేంద్రం క్లారిటీ..
Also Read
చంద్రబాబు సహా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినా పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో పాటు దత్తపుత్రుడు కలసి వైఎస్ జగన్ మీదా పోటికి వస్తున్నారని హెచ్చరించారు సీఎం జగన్.. చంద్రబాబు చేసినా అభివృద్ధి ఏంటి? జగన్ చేసిన అభివృద్ధి ఎంటో తెలుసుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మీమీ బ్యాంకు స్టేట్మెంట్ ఒకసారి చూసుకొండి.. ఎవరు ఎక్కవగా డబ్బులు వేశారు చూసుకోండి.. ఎవరి వల్ల ఎక్కువ లబ్ధి పొందారో చూసుకుని ఓటు వేయండి అని సూచించారు. ఇక, ఇంటికి వెళ్ళి పెన్షన్ లు ఇచ్చే వాలంటీర్లను పధకం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ తో లేకుండా చేయాలని చూశాడని విమర్శించారు. చంద్రబాబు మనిషి కాదు ఒక శాడిస్టు అంటూ మండిపడ్డారు. మళ్లీ జగన్ గెలిస్తేనే నేరుగా మీఇంటికి పథకాలు వస్తాయన్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Rajiv Gandhi Case: 3 దశాబ్దాల తర్వాత నిందితులకు వీడ్కోలు
ఇక, మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా? ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం అన్నారు. పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించిన సీఎం జగన్.. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్.. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన లక్ష్యం అన్నారు. డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని సూచించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!