YSR Lifetime Achievement Awards: సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Lifetime Achievement Awards: ఈ సంవత్సరం 27 మందికి వైయస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నాం.. ఇందులో నలుగురికి అచీవ్మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం చేస్తున్నాం.. సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అవతరించి ఇవాళ్టికి 67 సంవత్సరాలు.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేస్తున్నాం అన్నారు.. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న వ్యక్తులు వీరు.. సామాన్యులుగానే ఉన్న అసామాన్యులు వీరు.. 27 మందికి అవార్డులు అందించనున్నాం.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సేవ, వైద్యం వంటి రంగాల్లో అవార్డులకు ఎంపికైన వారంతా మన జాతి సంపదగా అభివర్ణించారు.
రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్ అవతరించి నేటికి 67 సంవత్సరాలైంది.. వరుసగా ఈ రోజుకు లెక్కేసుకుంటే ఇది మూడో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అన్నారు. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైయస్సార్ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం. మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఎంతగానో ఎదిగినా సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి అన్నారు.. ఈ సంవత్సరం 27 మందికి వైయస్సార్ అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇందులో నలుగురికి అచీవ్మెంట్, 23 మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఉన్నాయన్నారు.. తెలుగు తనానికి, తెలుగు మాటకు, తెలుగు వాడి గుండె ధైర్యానికి మన పల్లెలు, మన పేదలు, మన రైతుల మీద మమకారానికి, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం డాక్టర్ వైయస్సార్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నాం అని తెలిపారు.
Also Read
వైఎస్సార్ హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మారుస్తూ ఎన్నో ముందడుగులు పడిన పరిస్థితులు మనమంతా చూసినవే అన్నారు సీఎం జగన్.. ఇలాంటి రంగాల్లోనే మన వ్యవసాయానికి, మన చేనేతకు, మన తప్పెటగూళ్లకు, మన జానపదానికి, మన రంగస్థలానికి, మన అభ్యుదయ వాదానికి, హేతు వాదానికి సాటి మనుషులకు చేస్తున్న సేవలకు ఇలా పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న గొప్ప వ్యక్తులకు ఈ ఏడాది అవార్డుల్లో చోటు దక్కిందన్నారు.. వారి జీవితాన్ని అర్పించిన వారు మన హెరిటేజ్‌ను తమ భుజాల మీద మోసిన వారు.. వీరంతా మన జాతి సంపదగా అభివర్ణించారు. ఈరోజు సమాజం ఇచ్చిన గుర్తింపు ఆధారంగా ప్రదానం చేస్తున్న ఈ అత్యున్తన అవార్డుల్లో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడు సంవత్సరాల్లో సామాజిక న్యాయం వర్ధిల్లిందన్నారు.. ఈ వార్డులు అందుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!