CM YS Jagan: ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున బాబుకు ఓటేస్తే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు. అయితే, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అయిపోతాయి.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ చేశాం.. వివిధ పథకాల ద్వారా 2,70 వేల కోట్లు నేరుగా 130 సార్లు బటన్ నొక్కి నేరుగా అకౌంట్ లో వేశాం.. గతంలో ఎప్పుడైనా ఇలా నేరుగా అకౌంట్‌లో డబ్బులు వేశారా? అని నిలదీశారు.
Read Also: Lords Cricket Stadium: లార్ట్స్ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ పెంపు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
అమ్మ ఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తాం.. ఈబీసీ నేస్తాం.. విద్యా దీవెనతో లాంటి పథకాలు అందిస్తున్నాం అని గుర్తుచేశారు సీఎం జగన్.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెళ్ళుకు అండగా నిలిచాం.. ఇంటి వద్దకే పెన్షన్.. రేషన్, పథకాలు ఇచ్చిన ఘనత నాదన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంటికి పెన్షన్ వచ్చిందా..? పథకాలు వచ్చాయా..? అని ప్రశ్నించారు. అయితే, దేవుడు దయతో పేదాలందరికి మంచి చేశాను అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తు వస్తుందా? అని మరోసారి నిలదీశారు. ఏ పేదవాడికైనా ఒక్క మంచి పని చేశాడా..? చంద్రబాబుఅధికారంలోకి వస్తే మోసాలు చేశాడు..? గత ఎన్నికల ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశాడా..? చంద్రబాబు లాంటి మోసాగాడిని నమ్మాచ్చా…? ఇంటికి కేజీ బంగారు, బెంజ్ కారు ఇస్తానని చెబుతాడు.. నమ్ముతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మళ్లీ మేనిఫెస్టోతో మోసం చేయాలి చూస్తున్నాడు అని ఆరోపించారు. మళ్లీ వాలంటీకంలె ఇంటికి రావాలన్నా.. పెన్షన్ రావాలన్న.. బటన్‌లు నొక్కాలన్నా.. సీఎంగా మళ్లీ జగనే రావాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!