CM YS Jagan: చిరకాల స్వప్నం.. చరిత్రను మార్చబోతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.. ఇక, తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను జెండా ఊపి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు చిరకాల స్వప్నం, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్ చేశామని తెలిపారు.. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందని గుర్తుచేసిన ఆయన.. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆకాంక్షించారు ఏపీ ముఖ్యమంత్రి.
ఇక, 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంలో బందరు పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు సీఎం జగన్.. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకు కూడా ఇది చేరువలో ఉంటుందని.. ఇక, పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు సీఎం జగన్.. బందరుకు శతాబ్దాల చరిత్ర ఉంది.. అన్ని అనుమతులు వచ్చాయి.. రూ.5156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని.. ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందన్నారు సీఎం జగన్.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
చంద్రబాబు మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశాడని మండిపడ్డారు సీఎం జగన్.. పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయి.. ఇక అడుగులు వేగంగా పడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మచిలీపట్నం రూపు రేఖలు మారుతున్నాయన్నారు.. గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.. వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేదన్న ఆయన.. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారని తెలిపారు.. బందరు విద్యార్థులు ఇక్కడే మెడికల్ విద్య పొందే అవకాశం కల్పించాం.. మెడికల్ కాలేజీ నిర్మించామని వెల్లడించారు సీఎం జగన్.. కాగా, తొలి దశలో నాలుగు బెర్తులు, 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి 3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం కలుగుతుంది. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. ఈ పోర్టు క్లింకర్, గ్రానైట్ బ్లాక్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?