మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
READ MORE: REPO Rate: రెపో రేటు అంటే ఏంటి? ఇది తగ్గితే.. సామాన్యుడికి ఏం లాభం?
అయితే.. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కాములో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రెసిడెన్సియల్ లేఔట్స్ కింద మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ సీఎం సతీమణి నుంచి భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించింది. ఆమె నుంచి సేకరించిన భూముల విలువ కంటే అత్యధిక విలువ కలిగిన భూములను ఆమెకు కేటాయించారనేది ప్రధాన వివాదం. ఆమె నుంచి 3.16 ఎకరాల భూమిని తీసుకుని 50:50 రేషియో కింద ప్లాట్లను ముడా కేటాయించింది. మైసూరు తాలూకు కేసవ హొబ్లిలోని కసరె గ్రామంలో సర్వే నెంబర్ 464లోని 3.16 ఎకకాల భూమికి సంబంధించి సీఎం భార్యకు లీగల్ టైటిల్ లేదనేది ప్రధాన ఆరోపణ. దీనిపై లోకాయుక్త, ఈడీ ఏకకాలంలో విచారణ జరుపుతున్నాయి. ఇటీవల స్నేహమయి కృష్ణ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో సీఎంకు ఊరట లభించింది.
READ MORE: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!