మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
CM Siddaramaiah : ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు పెరుగుతున్నాయి. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.