ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా… ఎవడు కొట్టేది? అని దుయ్యబట్టారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం… ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తోన్న ప్రభుత్వం… ఇది ప్రజా ప్రభుత్వం.. వాడు అనుకుంటున్నాడు… లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని నిలదీశారు. కేసీఆర్ ఖాన్‌దాన్ మొత్తం వచ్చినా ఏమీ చేయలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు నెలలకో.. ఆరు నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామంటూ హెచ్చరించారు.
Read Also: Hyderabad: హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..
కేసీఆర్ ఫాంహౌజ్ కు ముఖ్యమంత్రి కావాల్సిందే తప్పా.. ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలకు పాపాల భైరవుడు అని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనార్టీలను, మహిళలను కేసీఆర్ నిలువు దోపిడికి పాల్పడ్డారని మండిపడ్డారు. నీ బిడ్డలు, నీ దోపిడీ, ఫార్మ్ హౌస్ ఎలా కట్టాలని ఆలోచించావు తప్పా.. ప్రజల కోసం ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sandeep Reddy Vanga: వెళ్లి నీ మాజీ భర్తను అడుగు.. కిరణ్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వంగా