NTV Telugu Site icon

CM Revanth: యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశం

Current

Current

అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తున్నాం అనుకుంటున్నారన్నారు. అది రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో తెలియడం లేదు వాళ్లకని విమర్శించారు. గత ప్రభుత్వం వాస్తవాలు ఎప్పుడూ సభ ముందు పెట్టలేదని అన్నారు. విద్యుత్ శాఖను స్కానింగ్ చేసి ప్రజల ముందు పెడతాం.. వాస్తవాలు ఒప్పుకుని.. హుందాగా ఉంటే బాగుంటుందని తెలిపారు. జగదీష్ రెడ్డి విచారణ చేయండి అని సవాల్ విసిరారు.. జ్యుడీషియల్ విచారణకి సిద్ధమని ముఖ్యమంత్రి అన్నారు. మూడు అంశాలపై జ్యుడీషియల్ విచారణకి సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు.

Student Suicide: కరీంనగర్లో విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం

విద్యుత్ సెంటిమెంటును గత ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చేసుకున్నారని, విద్యుత్ ను ఉపయోగించుకున్నా.. ఉపయోగించుకోకున్నా డబ్బులు చెల్లించాలని ఉందని అన్నారు. మీ ఉద్దేశాలు ఏందో విచారణలో తెలుతాయి.. ఛత్తీస్ ఘడ్ ఒప్పందంపై విచారణ చేస్తామని సీఎం అన్నారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందం మీద విచారణకు అదేశిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా.. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పై విచారణ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. సూపర్ క్రిటికల్ విధానం అమలు చేయండి అని కేంద్రం చెప్పింది.. కానీ ఇండియా బుల్ కంపెనీ సబ్ క్రిటికల్ విధానంతో చేస్తుంది వద్దు అన్నామన్నారు.

అంతేకాకుండా.. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏడేండ్లలో ఇంకా పూర్తి కాలేదు.. 6.47 కోట్లతో పూర్తి కావాల్సింది.. 9.74 కోట్లతో పూర్తి అయ్యిందని ముఖ్యమంత్రి తెలిపారు. KTPS 7 th ఫేజ్ కూడా అట్లనే చేశారని దుయ్యబట్టారు. దీన్ని రెండో అంశంగా విచారణలో చేర్చుతున్నామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా అంతే.. ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. తమ మంత్రి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకు నోరు పెంచుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.

Sabarimala Pilgrims: అయ్యప్ప భక్తుల సమస్యలపై.. రాజ్యసభలో తెలుగులో మాట్లాడిన ఎంపీ!

యాదాద్రి పవర్ ప్లాంట్ పైనా విచారణ చేస్తాం.. అంచనాలు ఎందుకు పెరిగింది అనేది కూడా విచారణ చేస్తామని సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పై జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తునట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. సభలో విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు.. ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాక్ బుక్ చూపిస్తే.. బుక్ లు మాయం చేశారని ఆరోపించారు. అఖిలపక్షంతో కమిటీ వేద్దాం.. అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళను కూడా చేరుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.