NTV Telugu Site icon

Telangana CM: డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. రాష్ట్రంలో ఆ మాట వినపడొద్దు..

Revanth

Revanth

డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డ్రగ్స్ నియంత్రణపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు.. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read Also: YSRCP: గెలుపే లక్ష్యం.. సిట్టింగ్‌లను మారుస్తూ సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

కాగా, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని ఆయన చెప్పారు. సేవ్ సొసైటీ.. సేవ్ జనరేషన్.. సేవ్ కిడ్స్ నినాదంతో ముందుకు వెళ్లాలి.. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. డ్రగ్స్ తీసుకోవాలంటే భయపడే విధంగా ఉండాలి.. డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించండి అని ఆయన పేర్కొన్నారు. శాఖా పరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి.. ప్రతి నెల నార్కోటిక్ బ్యూరో పైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Delhi: చేయని నేరానికి యువకుడికి జైలు శిక్ష.. తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా బయటకు..

ఇప్పటి నుంచి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్ ను నియమించడంతో పాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని ఆయన తెలిపారు. తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.