Site icon NTV Telugu

TS Govt: రూ. 2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి..

Runa Mafi

Runa Mafi

Loan Waiver: తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై నేడు రాష్ట్ర సీఎం డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రుతు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రామకృష్ణరావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Also: Operation Valentine : ‘ఆపరేషన్ వాలంటైన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖా, సంబంధిత విభాగాల పని తీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు నేటి నుంచే రైతు బంధు నిధులకు సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని చెప్పారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని వెల్లడించారు. రూ. 2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి.. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

Read Also: Telangana CM: డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. రాష్ట్రంలో ఆ మాట వినపడొద్దు..

ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇక నుంచి ప్రజావాణిగా పిలవాలని ఆయన ఆదేశించారు. రెండు రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలి.. అలాగే ప్రజల కోసం తాగు నీరుతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Exit mobile version