టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు… మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లు గా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఈ సినిమా కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.మొదట ఈ మూవీని డిసెంబర్ 08న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేశారు.
అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నూతన రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 16న తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ మరోవైపు పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా “మట్కా” సినిమా లో కూడా నటిస్తున్నాడు. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న మట్కా మూవీ వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది.
The power-packed #MissionBriefing Motion Teaser is here 💥
Feel the might of the Indian Air Force ❤️🔥#OperationValentine In Cinemas from 16th February 2024 in Hindi & Telugu
Teaser launching soon!#OPVOnFeb16@IAmVarunTej @ShaktipsHada89 @ManushiChhillar @sidhu_mudda pic.twitter.com/4ttThkNp1A
— Sony Pictures Films India (@sonypicsfilmsin) December 11, 2023