Revanth Reddy : మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరం నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీయనున్నారు. వరంగల్, హన్మకొండ నగరాల్లో తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీస్తారు.
Read Also : Husnabad : కలెక్టర్ కాళ్లపై పడి ఏడ్చిన మహిళా రైతు.. నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం
సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అది అయిపోగానే హెలికాప్టర్ ద్వారా వరంగల్ కు చేరుకుంటారు. హన్మకొండలోని సమ్మయ్య నగర్ పూర్తిగా నీటిలోనే ఉంది. ఈ ఏరియాలో దాదాపు 4వేల ఇండ్లు నీట మునిగినట్టు తెలుస్తోంది. ఈ ఇండ్లలోని ప్రజలంతా బయటకు వచ్చి రోడ్ల మీద ఉన్నారు. తూములు సమయానికి తెరవకపోవడంతోనే నీటిలో తమ ఇండ్లు మునిగిపోయాయంటున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసే ఛాన్స్ ఉంది. పంట నష్టం వివరాలు, తెగిపోయిన రోడ్లు, తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ సమస్యలు, తెగిపోయిన రోఎడ్లు, కుంటల గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంట నష్టపోయిన రైతులకు కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం ఉంది.
Read Also : Telangana BJP : అజారుద్దీన్ కి మంత్రి పదవి.. ఫిర్యాదు చేయనున్న బీజేపీ