NTV Telugu Site icon

CM Revanth: నేడు మేడిగడ్డకు సర్కార్ టూర్.. సీఎంతో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు..

Medigadda

Medigadda

Medigadda Barrage: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అయితే, మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, ఖర్చు గురించి అధికారులు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరిస్తారు. ఇక, ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఖర్గే పరిశీలించారు.

Read Also: BitCoin : రెండేళ్ల తర్వాత 50వేల డాలర్లను దాటిన బిట్ కాయిన్

ఇక, నేటి ఉదయం 10.15గంటలకి తెలంగాణ అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో బయలుదేరుతారు. మధ్యహ్నం 3.30 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5గంటల నుంచి 5.30 వరకు సీఈ సుధాకర్ రెడ్డి ప్రజెంటేషన్ ఉంటుంది.. 5.30 నుంచి 6గంటల వరకు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ప్రెసెంటేషన్ ఇవ్వనున్నారు.

Read Also: Gold Price Today: మగువలకు శుభవార్త.. దిగొస్తున్న బంగారం ధరలు!

అలాగే, సాయంత్రం 6 గంటల నుంచి 6.30గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బయలుదేరానున్నారు. 8.30 నుంచి 9గంటల వరకు పరకాలలో భోజనం చేయనున్నారు. ఇక, 9.30గంటలకి పరకాల నుంచి బయలుదేరుతారు.. అర్థరాత్రి 12 గంటలకు ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది.

Read Also: Aishwarya Rajinikanth :’కొలవెరి’ పాట వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది..

అయితే, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ దగ్గర నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కొంత మేర కుంగిపోయింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిపోయింది. ఇక, కాళేశ్వరం ఎత్తిపోతల్లో లక్ష్మీ బ్యారేజీ ఇది మొదటిది.. దీని మొత్తం పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా.. 2019లో గోదావరి నదిపై మేడిగడ్డ దగ్గర ఈ బ్యారేజీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.