Site icon NTV Telugu

Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

Cm

Cm

2024 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పార్టీని సంస్థగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఎన్నికల సమాయత్తంపై ఈరోజు సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో.. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నాయకులు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది.

Read Also: Parliament Session: నేడు రాజ్యసభ ముందుకు కీలకమైన మూడు బిల్లులు

కాగా.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకున్నారు. ఢిల్లీకి వెళ్తున్నందున దానిని వాయిదా వేశారు.

Read Also: Bomb Blast: మహబూబాబాద్‌లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్.. 25 ఇళ్లకు బీటలు!

కాంగ్రెస్ లో అత్యున్నత విధాయక మండలి సీడబ్ల్యూసీ.. ఈరోజు ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అవుతుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావడం ఎజెండాగా సమాలోచనలు జరపబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమాయత్తంపై సమావేశంలో చర్చించనున్నారు. పొత్తులు, ఎంపీ సీట్లు కేటాయింపు వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇంఛార్జీలను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్.

Read Also: Sandeep Reddy Vanga: ఏంటీ… ఈ ఇంటర్వ్యూ CGనా? మేము ఒరిజినల్ అనుకున్నామే

Exit mobile version