Site icon NTV Telugu

CM Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం కీలక నిర్ణయం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి స్పందించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

Read Also: Harish Rao: దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యం!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఎవరు మోసం చేసేందుకు ప్రయత్నించినా చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గురువారం జనగామ మార్కెట్‌ యార్డులో రైతుల ఆందోళన అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మార్కెట్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్‌ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు” అని సీఎం హెచ్చరించారు.

Exit mobile version