NTV Telugu Site icon

CM Revanth Reddy: మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తాం..

Cm

Cm

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. అధికార- విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగింతపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రాజెక్టులను అప్పజేప్పేది లేదని తేల్చి చెప్పింది. ఇక, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు.

Read Also: Edible Oil Import Reduced : భారత్ లో 28శాతం పడిపోయిన ఎడిబుల్ ఆయిల్ దిగుమతి

అయితే, నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాం.. సభ్యులు వాస్తవాలు చూడాలన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తామన్నారు.. ప్రాజెక్ట్ రీడిజైన్ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టి అంచనాలు పెంచారు.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించి వాస్తవాలను ప్రజలకు చెప్పాం అని ఆయన పేర్కొన్నారు. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది.. ఇసుక కదిలేలా పేకమేడలు కట్టారా అంటూ సీఎం ప్రశ్నించారు. కుంగిన ప్రాజెక్టును చూపించకుండా గత ప్రభుత్వం దాచి పెట్టింది.. అక్కడికి ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు.. కొందరు అధికారులు డాక్యుమెంట్లను మాయం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Sanjana Ganesan: మీకెంత ధైర్యం?.. వెళ్లిపో! బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌ ఫైర్

ఇక, కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండన్నారు. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి.. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పాలని ఆయన కోరారు. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?.. తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏంటి? అని ప్రశ్నించారు. కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు.. కాళేశ్వర్ రావుని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను.. మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే.. హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది.. రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి శ్వేతపత్రం విడుదల చేస్తారు.. కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Gun Fire : న్యూయార్క్ సిటీ సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

అలాగే, తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు.. వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు.. కానీ, రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది అని ఆయన ఆరోపించారు. రూ.1 లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు అని సీఎం అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది.. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది.. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.