NTV Telugu Site icon

CM Revanth Reddy : నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Revanth

Revanth

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్‌ ఉంది. ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూభారతిపై కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

PM Modi: నేడు రోజ్‌గార్‌ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ

అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన భూభారతి (రికార్డ్ ఆఫ్ రెవెన్యూ – 2024) బిల్లు, కాస్తు కాలమ్/అనుభవదారు కాలమ్‌ను పునరుద్ధరించడం ద్వారా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు తిరిగి రికార్డుల్లోకి రావడం వల్ల కొన్ని వర్గాలు సంతోషించగా, మరికొన్ని వర్గాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయంతో ఉంది. ‘‘ఏనాడో ఈ మార్పు జరిగిపోయింది. ఇప్పుడు పేర్లు తిరిగి రాయడం గొడవలకు దారితీస్తుంది,’’ అని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో కాస్తు కాలమ్, అనుభవదారు వ్యవస్థకు ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో రైతాంగ పోరాటాలు, నక్సల్బరీ ఉద్యమాల ద్వారా లక్షలాది ఎకరాలు పేదలకి లభించాయి. ప్రస్తుతం 1.30 కోట్ల ఎకరాల్లో 30 లక్షల ఎకరాలను రైతులు దశాబ్దాలుగా దున్నుతున్నారు. అయితే, ఈ భూముల్లో కొందరికి మాత్రమే హక్కులు లభించాయి. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత, అనేక మంది పేర్లు రికార్డుల నుంచి తొలగించబడ్డాయి.

ధరణి అమలులోకి రావడం ద్వారా భూములపై పేదల నియంత్రణ తగ్గిందన్న అభిప్రాయం ఉంది. రికార్డుల్లో పేర్లను తొలగించడం వల్ల పేదలకు నష్టమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అనుభవదారుల పేర్లను కాస్తు కాలమ్ నుంచి తొలగించి, పట్టాదారుల పేర్లను మాత్రమే నమోదు చేశారు. ఈ ప్రక్రియలో ఎటువంటి సంప్రదింపులు లేకపోవడం, చట్టపరమైన ఉత్తర్వులు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రశ్నార్థకమైంది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి డేటాలో మార్పులు జరిగాయి. తమ భూమి మాకాదని వదిలేసి వెళ్లిన భూస్వాములు తిరిగి వచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. పేదలను బెదిరించి భూములను రియల్టర్లకు అమ్ముకున్న ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ వంటి ఉమ్మడి జిల్లాల్లో లక్షల ఎకరాలు సంపన్నుల చేతుల్లోకి వెళ్లాయి.

వారసత్వ హక్కులు, భాగస్వామ్యాలు, సాదాబైనామాల కింద భూముల కొనుగోళ్లు వంటి వివిధ సందర్భాల్లో కాస్తు కాలమ్‌లో పేర్లు నమోదయ్యాయి. కానీ, ప్రస్తుతం దాదాపు 9 లక్షల అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. కాస్తు కాలమ్ పునరుద్ధరణకు పాలనాపరమైన సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ఎవరికి సమస్యలు తలెత్తుతాయి? హక్కుదారులకు ఇబ్బందులు ఏమైనా ఉంటాయా?’’ అన్న ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నెహ్రూ చెప్పినట్లు, ‘‘పొజిషన్‌ను కాపాడటం ప్రభుత్వ బాధ్యత,’’ అని ప్రభుత్వం భావించాలి. ఇక, భూస్వాములు, పేద రైతులు, రెవెన్యూ శాఖ మధ్య సమన్వయం సాధించడం ఈ సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు.

IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం!

Show comments