CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Read Also: MLC Kavitha: ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరిన రోజు ఇది..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు ఈ పథకం అమలుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.సమగ్ర కుటుంబ సర్వే పూర్తి అయిన తరువాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రులు, అధికారులు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు అందాయి. గ్రామసభల ద్వారా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోది.
ప్ర ఇళ్ల నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల చొప్పున నిధులను సర్కారు విడుదల చేస్తుంది. ఐదేళ్లలో రూ.28 వేల కోట్లతో 20 లక్షలకుపైగా ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో రూ.7,740 కోట్ల వ్యయంతో గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. స్థలం లేనివారికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్లు మంజూరు చేయాడానికి ప్రభుత్వx భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే విధంగా చర్యలు చేపడుతోంది.