CM Revanth Reddy: తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలి..
- నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలి
- ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ-1956 సెక్షన్ 3ని పరిగణనలోకి తీసుకోవాలి
- గోదావరి-బనకచర్లపై అభ్యంతరాలతో జల్‌శక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రికి లేఖలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (ఏపీఆర్ఏ)-2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌనిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిందని సీఎం తెలిపారు. కేడబ్ల్యూడీటీ-II తదుపరి విధివిధానాలపై (ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వని విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
Tata Nexon 2025: కొత్త అవతార్‌లో నెక్సాన్ 2025 లాంచ్.. బ్రెజ్జా, వెన్యూ, సోనెట్‌లకి గట్టి పోటీ..
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
రాష్ట్ర నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాధ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు (జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ) తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Boult Z40 Pro: రూ. 5 వేలు విలువ చేసే ఇయర్ బడ్స్ జస్ట్ రూ. 1200కే.. 100 గంటల ప్లే టైమ్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీతో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!