Site icon NTV Telugu

CM Review: సెక్రటేరియట్లో ముగిసిన సీఎం సమీక్ష

Cm Reciew

Cm Reciew

CM Review: సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.

Read Also: Harish Rao: ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.. కేసీఆర్‌ సర్జరీ పై హరీష్ రావు

ఇదిలా ఉంటే.. సమీక్ష ముగిసిన అనంతరం నేరుగా సచివాలయం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మరికాసేపట్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై హైకమాండ్ తో చర్చించనున్నారు. మరోవైపు.. ఢిల్లీకి చేరుకున్నాక నేరుగా పార్లమెంట్‌కు వెళ్లనున్నారు రేవంత్‌ రెడ్డి. అక్కడ తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇదిలా ఉంటే.. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార నేపథ్యంలో ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు.

Read Also: Telangana: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

Exit mobile version