తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటిస్తున్నారు. రేవంత్ తో సహా వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వరంగల్ ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు సీఎం రేవంత్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్సంపేటపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్. రూ.532.24 కోట్లతో నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.
శంకుస్థాపన పనుల వివరాలు:
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ.82.56 కోట్లతో హన్మకొండ-నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.17.28 కోట్లతో నర్సంపేట- పాఖాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ. 20 కోట్లతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Also Read:Virat Kohli 100 Centuries: 40 మ్యాచ్‌లు, 16 శతకాలు.. విరాట్ కోహ్లీ 100 ‘సెంచరీ’లు చేస్తాడా?
అనంతరం బహిరంగసభలో పాల్గొని సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఈ పదేళ్లలో భారీగా ఆస్తులు సంపాదించారు.. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. వరికి ప్రోత్సాహకాలిచ్చామని తెలిపారు. ఉచిత విద్యుత్ పేటెంట్ మా పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు ఫాంహౌస్ లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు.. ఉద్యమగడ్డ వరంగల్ కు మాత్రం ఏమీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.. 3 కోట్ల 10 లక్షల మందికి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
