CM Revanth Reddy: ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి..
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు చేస్తున్నారు- సీఎం
- మనుషులు పెట్టి విష ప్రచారాలు చేసినా..
- దావోస్‌లో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం- సీఎం
- మేము వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికే- రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.1.80 వేల కోట్లు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చినందుకు ఆయా కంపెనీలకు ధన్యవాదములు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలలో.. ఇదే అతి పెద్ద విజయం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు.
Read Also: Kakani Govardhan Reddy: సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?
Also Read
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2004-2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు ప్రధాని పీవీ సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకు వచ్చారు.. ప్రపంచానికి ఒక బలమైన విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకత్వం చూపిందని తెలిపారు. రాజకీయ పరమైన విధానాలను విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపేక్షించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి దారులకు వేగంగా భూములు అనుమతులు ఇస్తున్నాం.. ఉద్యోగావకాశాలు పెంచాలని తమ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Ramachandru Nayak: పిచ్చెక్కి మాట్లాడుతుండు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎమ్మెల్యే ఫైర్
తెలంగాణకు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.. వారికి కావలసిన భూములు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌లో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉండాలన్నారు. వన్ ట్రిలియన్ ఏకానమీ కలిగి.. దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా1 నిలిచిందని సీఎం పేర్కొన్నారు. సింగపూర్‌లో 10th చదివిన తర్వాత విద్యార్ధులను సాంకేతిక నైపుణ్యంలో నిష్ణాతులైన వారిగా రూపొందిస్తుంది.. ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ-సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పని చేయాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు.
Sridhar Babu: ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ అందించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం..
మేము దావోస్ వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలు మన దగ్గర సొమ్ము పెడతా అని వచ్చారన్నారు. ఈ ఫార్ములాలో ఇక్కడ సొమ్ము విదేశాలకు పంపారు.. పెట్టుబడి పెట్టుకున్నారు.. ప్రజల సొమ్ము కొల్లగొట్టి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏ సంస్థలు పెట్టుబడి పెట్టాయో వివరాలు ఇస్తానని అన్నారు. తాము కంపెనీల కార్యాలయాలకు వెళ్లలేదు.. కంపెనీలు తమ ఆఫీస్‌కి వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల జాబితా ఇస్తామని పేర్కొన్నారు. కంపెనీలతో చెక్ చేసుకోండి.. పెట్టుబడులు స్వాగతించక పోయినా అక్కసు ఎందుకని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!