దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు. తాను, మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళామని సీఎం తెలిపారు. ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఈ విజయం అత్యంత ముందుదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు.
Read Also: Kakani Govardhan Reddy: సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?
ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2004-2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు ప్రధాని పీవీ సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకు వచ్చారు.. ప్రపంచానికి ఒక బలమైన విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకత్వం చూపిందని తెలిపారు. రాజకీయ పరమైన విధానాలను విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపేక్షించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి దారులకు వేగంగా భూములు అనుమతులు ఇస్తున్నాం.. ఉద్యోగావకాశాలు పెంచాలని తమ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Ramachandru Nayak: పిచ్చెక్కి మాట్లాడుతుండు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎమ్మెల్యే ఫైర్
తెలంగాణకు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.. వారికి కావలసిన భూములు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌లో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉండాలన్నారు. వన్ ట్రిలియన్ ఏకానమీ కలిగి.. దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా1 నిలిచిందని సీఎం పేర్కొన్నారు. సింగపూర్‌లో 10th చదివిన తర్వాత విద్యార్ధులను సాంకేతిక నైపుణ్యంలో నిష్ణాతులైన వారిగా రూపొందిస్తుంది.. ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ-సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పని చేయాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు.