NTV Telugu Site icon

Revanth Reddy Meet To Auto Drivers: ఇవాళ సాయంత్రం ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ..?

Auto Drivers

Auto Drivers

Revanth Reddy : ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, ఊబర్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఇక, ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రానున్న రెండు రోజుల్లో నిరసన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు.

Read Also: Bahubali Salaar: ఆ కటౌట్ కత్తి పడితే రిజల్ట్ ఈ రేంజులోనే ఉంటుంది…

అయితే, సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంపై పునరాలోచించాలన్నారు. లేకుంటే ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయంగా ప్రతి నెల రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పథకం ద్వారా తాము చాలా వరకు నష్టపోతున్నామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. మహాలక్ష్మీ పథకం వల్లే చాలా వరకు ఆటోలను ఫైనాన్స్‌లో కొనుగోలు చేసిన మేము నెలవారీ.. పేమెంట్స్ కట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్నామని వారు పేర్కొంటున్నారు.

Read Also: Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు

తమ ఆటోలో ఎవరు ఎక్కకపోవడంతో ఆటో స్టాండ్స్‌ అన్నీ నిర్మానుషంగా మారాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి ఆటో కార్మికులకు ఉపయోగపడేలా, వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆటో, ఊబర్ డ్రైవర్లు కోరుతున్నారు. గతంలో 1000 నుంచి 1500 రూపాయల వరకు రోజువారి సంపాదన వచ్చేది.. కానీ, మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు కేవలం రూ.100 నుంచి 200 వరకు కూడా రావడం లేదని ఆటో కార్మికులు వాపోతున్నారు.