NTV Telugu Site icon

CM Revanth Reddy: “అర్థం పర్థం లేని లెక్కలు”.. కేసీఆర్ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..

Revanth Reddy

Revanth Reddy

కేసీఆర్ సర్వే ఎంత గొప్పగా ఉందో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల లెక్క చూస్తే అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ నేతల సమావేశంలో కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “సమగ్ర సర్వేలో ఎస్సీలలో 82 కులాలు అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప కులాలు అలా సంఖ్య పెరిగింది. సమగ్ర సర్వే అర్థం పర్థం లేని లెక్కలు. సిగ్గుతో బయట పెట్టలేదు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుకు వెళ్లి బీసీ కుల గణన ఆపాలని చూస్తున్నాయి. అందుకే లెక్క సరిగ్గా.. ఆధారాలతో సహా చేశాం. కంప్యూటర్ లోనే కాదు.. సర్వే చేసిన పేపర్ బండిల్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మన దాంట్లో ఉన్న కొందరు అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అక్కడ.. ఇక్కడో ఒకరిద్దరు.. ఎక్కడో ఒకచోట తప్పులు జరిగి ఉండొచ్చు. తప్పు జరిగితే.. సరిదిద్దుకుంటాం అని అంటున్నారు. మనం చేసిన లెక్క పక్కగా ఉంది.. ఎలాంటి తప్పు జరగలేదు.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Maruti Suzuki Ciaz: షాకింగ్.. మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు నిలిపివేత.. కారణం?

“బీసీ లెక్కలు రాత్రికి రాత్రే రాలేదు.. చాలా మంది కొట్లాడారు. ఎన్నో ఏండ్లుగా వస్తున్న డిమాండ్ మనం ముందుకు తీసుకు వెళ్తున్నాం. బీజేపీ తప్పుపడుతుంది. మనం అధికారికంగా చేసిన నివేదిక చూసి దేశం అంతా అమలు చేయాల్సి వస్తుంది అని భయపడుతున్నారు. బీజేపీలో ఆధిపత్యం వహించే వారికి నష్టం జరుగుతుంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ చేసిన సర్వేని అడ్డుకోవాలని చూస్తుంది. కేసీఆర్ లెక్క ప్రకారం 51 శాతం బీసీలు ఉన్నారు. మనం చేసిన సర్వేలో 56.33 శాతం ఉన్నారు. బీసీల లెక్క తగ్గిందా? పెరిగిందా..? కేసీఆర్ సర్వేలో ఓసీల శాతం 21.. నేను 17 శాతం ఇచ్చాను. మేము చేసిన సర్వేలో బీసీల సంఖ్య పెరిగింది. కేసీఆర్ తగ్గించి చూపించారు. కేసీఆర్ సర్వేలో మైనార్టీ ఎక్కడో చెప్పండి. మోడీ..70 మైనార్టీ కులాల బీసీలలో చేర్చిన అన్నారు.” అని సీఎం రేవంత్ రెడ్డి పీఎం మోడీ వీడియోను ప్లే చేశారు.

READ MORE: Shivraj Singh: ఎయిరిండియాలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. విరిగిపోయిన సీటులో ప్రయాణం

బండి సంజయ్.. కూడా బీసీలలో మైనార్టీలను కలిపారని అంటున్నారని… గుజరాత్‌లో.. మోడీ చేసిన పని ఏంటి? అని బండి సంజయ్‌ను రేంవత్ రెడ్డి ప్రశ్నించారు. “తప్పుడు మాటలు కాదు.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పండి? నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిని. నాకు నా నాయకుడు చెప్పినది చేశా. నాకు తెలుసు.. నాకు ఎన్ని ఒత్తిడిలు ఉన్నాయో.. ఎంత మంది ఎన్ని చెప్పినా నేను వినలేదు. రాహుల్ గాంధీ చెప్పిన మాట విన్న. నాయకుడు ఏం ఆదేశిస్తే అది చేశా. ఇప్పటికీ చేస్తున్నా.. ఏనాడైనా… అదే నా విధానం. మన లెక్క నూటికి నూరు శాతం పక్కా. మోడీ తప్పకుండా లెక్క చేయాల్సిన పరిస్థితి వస్తది. రాహుల్ గాంధీ దేశం అంతా తిరగబోతున్నారు.” అని సీఎం రేవంత్ వెల్లడించారు.