NTV Telugu Site icon

CM Revanth: కేసీఆర్.. అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా

Assembly

Assembly

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు.. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా అని ప్రశ్నించారు. వాళ్ళ త్యాగం గుర్తించారా అని అన్నారు. కేసీఆర్.. అమరుల కుటుంబంకి బుక్కెడు బువ్వ పెట్టారా అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు.. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు.. కానీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏం చేశారని ప్రశ్నించారు. కరోనా మందు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న వాళ్లను రాజ్యసభ పంపిన చరిత్ర మీది అని దుయ్యబట్టారు.

Bhogapuram Green Field Airport: 2025లో అందుబాటులోకి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌!

నళిని డీఎస్పీగా ఉండి.. తెలంగాణ కోసం తన ఉద్యోగంకి రాజీనామా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పిలిచి ఉద్యోగం ఇస్తా రండి అని చెప్పిందా.. నళినికి న్యాయం జరగలేదు కానీ.. కూతురు నిజామాబాద్లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ వాళ్ళదని అన్నారు. తెలంగాణా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పై ఉన్న కేసులు ఎన్ని.. ఉద్యమ కారులపై ఉన్న కేసులు ఎన్ని అని కేసీఆర్ ఎప్పుడైనా సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఉద్యమాల పార్టీ ధర్నా చౌక్ ఎత్తేశారని విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్నీతి మీది అని దుయ్యబట్టారు. ధర్నా చౌక్ ని పునరుద్దరిస్తే.. అభినందించాల్సినది పోయి అడ్డుపడుతున్నారని తెలిపారు.

INDIA bloc: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ‘ఇండియా’ కూటమిపై ప్రశ్న.. సీఎం నితీష్ కుమార్‌పై బీజేపీ ఫైర్..

రైతు భీమా లెక్కల ప్రకారం లక్షల మంది చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుని ఆదుకోవడానికి పథకాలు ఉండాలి.. చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చుడు కాదు.. రైతు చావుకు ఐదు లక్షలు వెల కట్టిందని దుయ్యబట్టారు. కేసీఆర్ వరి పంట అద్భుతం అన్నాడు.. రైతులను ఆదుకోండి అని ఒత్తిడి చేస్తే.. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. తన ఫార్మ్ హౌస్ లోని 150 ఎకరాల్లో కేసీఆర్ మాత్రం వరి పండించాడు.. పేద రైతులకు క్వింటాలుకు1960 రూపాయలు ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పండించిన పంటకు 4250 ఇచ్చారు.. ఎవరు ఇచ్చారు.. ఎందుకు ఆ ధర ఇచ్చారో విచారణ చేయమని అంటారా అని రేవంత్ రెడ్డి అన్నారు. నేను రెడీ విచారణ చేయడానికి.. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదు.. అబద్ధాల పునాదుల మీద ఎదిగిన పార్టీ వాళ్ళదని సీఎం విమర్శించారు. తలసరి వినియోగంలో 10వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.