NTV Telugu Site icon

CM Revanth Reddy : అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

షాద్‌నగర్‌ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కోందుర్గులో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… 28 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భూమి పూజ చేశామని, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్‌ నిర్మాణం, ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం రూ.5వేల కోట్లతో ప్రాజెక్ట్‌ నిర్మాణం చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ 5 వేల పాఠశాలలను మూసివేసిందని సీఎం రేవంత్‌ అన్నారు.

Minister Narayana: మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం..

నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా రాకుండా పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, 34 వేల మంది టీచర్లను బదిలీ చేశామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. టీచర్లతో పెట్టుకుంటే ఏమీ చేయరు కానీ, పోలింగ్‌ రోజు బూత్‌లలో చేయాల్సింది చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. పేదల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించలేదని, పేదలకు విద్యను అందిస్తే వాళ్ళు బానిసలుగా ఉన్నారనే భావనలో కేసీఆర్ ఉన్నారన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టింది పీవీ నరసింహారావు అని, కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు.

Mahesh Kumar Goud : మజ్లిస్‌తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు.. తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్