Site icon NTV Telugu

CM Revanth Reddy: యాదాద్రి థర్మల్‌ స్టేషన్‌ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్‌ స్టేషన్‌లోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. థర్మల్ స్టేషన్‌లోని పైలాన్‌ను ముఖ్యమంత్రి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల రెండో యూనిట్ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు నిర్వహించారు. పవర్ ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం, మంత్రులు తిలకించారు.

Read Also: Minister Sridhar Babu: గాడి తప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం..

నల్గొండ జిల్లాలోని దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో మొత్తంగా 5 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌ సామర్థ్యం 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మొదటి యూనిట్ గతంలో ప్రారంభం కాగా, ఇవాళ రెండో యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 72 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగిన అనంతరం యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఈ ప్లాంట్‌ నుంచి త్వరలోనే 1600 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌తో అనుసంధానం కానుంది.

 

Exit mobile version