NTV Telugu Site icon

CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలని సీఎం అన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.ఈ ఏడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని సీఎం ఇప్పటికే ప్రకటించారు.

Read Also: TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్ గౌడ్‌.. కారణమేంటి?

Show comments