NTV Telugu Site icon

Revanth Reddy: మీ పెంపుడు కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా..

Revanth

Revanth

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తీతో పని చేయాల్సిన నాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని విమర్శించారు. కల్వకుంట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంట్లో పెంపుడు కుక్కకు జ్వరం వచ్చింది అని డాక్టర్ మీద చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మీరు పెంచుకున్న కుక్కకు ఉన్న విలువ ప్రజలకు లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Upendra Singh Rawat: నిర్దోషి అని నిరూపించుకునే వరకు ఎన్నికల్లో పోటీ చేయను..

నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడాలని అనేది మా విధానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వాలి అనేది మా పాలసీ.. మా ప్రభుత్వం వచ్చింది.. మా ఉద్యోగాలు వస్తాయి అనే భరోసా ఇస్తున్నాం వారికి.. గడీలో బందీ అయినా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వచ్చామా లేదా..? అని ఆయన అడిగారు.. మా పని తీరు.. మా నియామకాలపై ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనే పదం వినొద్దని చెప్పినం.. గంజాయి మొక్క కూడా ఉండొద్దు అని చెప్పామని సీఎం చెప్పుకొచ్చారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద విద్యార్థులకు అవగహన కల్పించండి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో కొన్ని నియామకాలు ఆగిపోయాయి. కోడ్ అయిపోగానే అందరికి ఉద్యోగాలు ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మీ సహకారం మా ప్రభుత్వానికి ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.