NTV Telugu Site icon

CM Revanth Reddy : ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దాం

Ts Assembly

Ts Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతు్న్నాయి. బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ ల మధ్య చర్చలు హీటును పుట్టించాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదని, మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండని, నేను కూడా దీక్షలో కూర్చుంటానని ఆయన సవాల్‌ విసిరారు. ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దామని సీఎం రేవంత్‌ ఉద్ఘాటించారు. రూ.వంద పెట్టి పెట్రోల్‌ కొన్న ఆయనకు అగ్గిపెట్టకు పైసలు లేవా.? అంటూ మాజీ మంత్రి హరీష్‌ రావుపై సీఎం రేవంత్‌ సెటైర్లు వేశారు.

Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..

అంతేకాకుండా.. ‘మోడీ ప్రేమలో అమరులం అవుతామని నాడు కేసీఆర్‌ అనలేదా.? మీ ప్రేమ, ఆశీర్వాదం ఉంటే చాలు. వేల కోట్లు డబ్బులు అక్కర్లేదన్న మాట వాస్తవం కాదా.? పార్లమెంట్‌ మెట్ల దగ్గర మా ఎంపీలు ధర్నాలు చేస్తు్న్నారు. మరి మీ ఎంపీలు ఎక్కడున్నారు. విలీనం కోసం ఇళ్లిల్లు తిరుగుతోంది బీఆర్ఎస్‌ సభ్యులు కాదా.? 370 యాక్ట్‌ రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో మోడీ సర్కార్‌కు బీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతివ్వలేదా.? గతంలో మోడీకి కేసీఆర్‌ ఊడిగం చేశారు. జీఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్‌ మద్దతు పలికింది. కేంద్రానికి కోపం వస్తుందని కేటీఆర్‌ పదే పదే ఆవు కథ చెబుతున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీకి కేసీఆర్‌ మద్దతు తెలిపారు. ప్రత్యేక విమానంలో వెళ్లి బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జీఎస్టీకి మద్దతుగా ఓటేశాడు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. 370 ఆర్టికల్‌ రద్దు, ట్రిపుల్‌ తలాక్‌కు కూడా బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది. అదానీ, అంబానీలతో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

AP Assembly: లిక్కర్‌పై శ్వేతపత్రం.. పవన్‌ కల్యాణ్‌, విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు