ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు. వ్యూహంతో పని చేస్తున్నామని.. గత ప్రభుత్వం సాధించనివి ఎన్నో.. తాను సాధించానన్నారు. ఢిల్లీలో కేంద్రం ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చే రాష్ట్రం కోసం మాట్లాడాలన్నారు. తాను ఎవరికైనా భయపడితే రేవంత్ రెడ్డిని కాదని ఫైర్ అయ్యారు.. రాష్ట్ర అవసరాల కోసం ఢిల్లీతోపాటు, అవసరమైతే రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్తామని.. నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అక్కడ మాట్లాడుతామన్నారు.
READ MORE: BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా టైగర్లు.. తొలి టీ20 సిరీస్ గెలుపు..!
“కేటీఆర్ సవాలు విసురుతున్నారు. డ్రగ్స్ విషయంలో టెస్టులకు రమ్మంటే నేను, విశ్వేశ్వర్ రెడ్డిలం గన్ పార్క్ కి వెళ్ళాం. కేటీఆర్ రాలేదు.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నేను ప్రతిపక్ష నేతతోనే మాట్లాడతాను. దుబాయిలో కేటీఆర్ మిత్రుడు కేదార్ డ్రగ్స్ తీసుకొని చనిపోయారు. ఆ కేసులో దుబాయ్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని, ఇక్కడ విచారణ చేస్తాం. కేటీఆర్ బామ్మర్ది కేదార్లు కలిసి డ్రగ్స్ వ్యాపారం చేశారు. కేటీఆర్ చుట్టూ ఉన్నవాళ్లు డ్రగ్స్ తీసుకునే వాళ్లే.. నేను తెరిచిన పుస్తకం. నేను టెస్ట్‌లకు రెడీ. కోర్టుకు వెళ్లి కేటీఆర్ స్టే తెచ్చుకున్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతుంది. విలన్లు ఎప్పుడైనా క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారు. కాలేశ్వరం, ఫోన్ టాపింగ్, హెచ్ఎండిఏ ఎన్నో కేసులో విచారణ జరుగుతుంది. ఫోన్ టాపింగ్ కేస్ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు హైకోర్టుకు వివరిస్తున్నాం. ప్రభాకర్ రావు ఇండియాకు ఆలస్యంగా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే.. కేంద్రం ఎందుకు ప్రభాకర్ రావును తీసుకురాలేదు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
