NTV Telugu Site icon

CM Revanth Reddy : నేను చీఫ్ అయ్యాకా.. ఇంద్రవెల్లి నుండి సమరశంఖం పూరించాం

Cm Revanth Reddy Hydera

Cm Revanth Reddy Hydera

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ… రాహుల్ గాంధీ పెట్టుకున్న నమ్మకాన్ని మహేష్ గౌడ్ కొనసాగిస్తారన్నారు. మహేష్ గౌడ్ కి అండగా ఉంటామన్నారు. 2021 జూన్ 7నాడు నన్ను పీసీసీ చీఫ్ గా సోనియా గాంధీ చేశారని, 38 నెలలు నిరంతరం పని చేస్తూ.. ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నానన్నారు. నేను చీఫ్ అయ్యాకా.. ఇంద్రవెల్లి నుండి సమరశంఖం పూరించామన్నారు. సన్న వడ్లు పండించిన ప్రతీ రైతుకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు లక్షల పైబడి ఉన్న రుణం చెల్లించండి.. 2 లక్షల రుణాలు ఉన్న రైతు ఖాతాలో వేసే బాధ్యత నాది అని, ప్రపంచానికి ఆదర్శంగా ఫోర్త్ సిటీ, పార్టీ. .ప్రభుత్వం జోడెడ్ల లాగా నడవాలన్నారు.

Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తూ ఆరుగురు మృతి

అంతేకాకుండా.. ’24 గంటలు పార్టీకి సమయం ఇచ్చే నాయకుడిని పీసీసీ చేయండి అని అధిష్టానంకి చెప్పాను. కార్యకర్తలకు అండగా మహేష్ గౌడ్ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ప్రయోజనం. మొన్న ఎన్నికల్లో గెలవడం సెమీ ఫైనల్ మాత్రమే. 2029 ఫైనల్ .. మోడీని ఓడించి..రాహూల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టు. 2029 లో 15 ఎంపీ సీట్లు గెలిచి.. రాహూల్ గాంధీని ప్రధాని నీ చేద్దాం. ఎవరు అసంతృప్తి కి లోనవ్వకండి. రాహుల్ గాంధీని ప్రధాని నీ చేసే వరకు మేము సమన్వయం తో పని చేస్తాం. ‘ అని ఆయన అన్నారు.

Working Age Population: భారత్‌‌కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..

అయితే.. గాంధీ..కౌశిక్ దాడుల ఎపిసోడ్ పై సీఎం స్పందిస్తూ.. సంకనాక పిలిచాడా.. రా అని.. వెళ్లి వీపు పగల కొడితే.. కొట్టిరు అంటారు.. మా వాళ్ళు ఎవరి జోలికి పోరు.. వస్తే ఊరుకోరు.. మహేష్ గౌడ్ సౌమ్యుడు ఏం కాదు అనుకోకండి.. మహేష్ గౌడ్ వెనక నేను ఉంటా.. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటా.. మిమ్మల్ని గెలిపిస్తం.. మా గెలుపుకోసం పని చేసిన దానికంటే ఎక్కువ కష్టపడతా.. ఇవాళ పీసీసీగా ఆఖరి రోజు.. కొన్ని సీఎంగా కొన్ని మాట్లాడకూడదు’ అని ఆయన అన్నారు.