Site icon NTV Telugu

CM Revanth Reddy: వర్షలు పడుతున్నాయి, అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం ఆదేశాలు..!

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.

Read Also: Beerla Ilaiah: నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ పై ఐలయ్య ఫైర్..!

హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ఇక వాతావరణశాఖ ప్రకారం మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న కారణం చేత సీఎం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

Read Also: MG Windsor EV: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు 449 కి.మీ రేంజ్‌ వచ్చే ఎంజీ విండ్సర్ EV లాంచ్.. ధరలు, ఫీచర్లు వివరాలు ఇలా..!

Exit mobile version