Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Directs Officials To Ensure All Class 10 Pass Students Complete Intermediate Education

CM Revanth Reddy: ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి..!

Published Date :July 2, 2025 , 5:43 pm
By Kothuru Ram Kumar
  • 9-12 త‌ర‌గ‌తుల విధానంపై అధ్య‌య‌నం చేయండి.
  • కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల నిధులు సాధించాలి.
  • యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ప్ర‌గ‌తిపై నివేదిక స‌మ‌ర్పించాలి.
CM Revanth Reddy: ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: ప‌దో త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌దో త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తోంద‌ని… ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌డానికి గ‌ల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు. విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందున‌.. ఆ ద‌శ‌లో విద్యార్థికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ల‌భించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇత‌ర రాష్ట్రాల్లో 9వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉంటుంద‌ని.. అక్క‌డ డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు సీఎంకు తెలియ‌జేశారు. ఇంట‌ర్మీడియ‌ట్ వేరుగా.. 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పాఠ‌శాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్య‌య‌నం చేసి ఈ విధానంపై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యంలో విద్యా క‌మిష‌న్, ఆ విభాగంలో ప‌ని చేసే ఎన్జీవోలు, పౌర స‌మాజం సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్య మెరుగుకు అన్ని ద‌శ‌ల్లో చ‌ర్చించి శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చ‌కు పెడ‌తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also:Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

ఇంట‌ర్మీడియ‌ట్‌లో విద్యార్థుల చేరిక‌తో పాటు వారి హాజ‌రుపైనా దృష్టిపెట్టాల‌న్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల న‌మూనాల‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప్ర‌తి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. పాఠ‌శాల‌ల నిర్మాణం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని , నిర్మాణాల ప్ర‌గ‌తిపై ప్ర‌తి వారం త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బాలుర‌కు ఒక‌టి, బాలిక‌ల‌కు ఒక‌టి యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తామ‌న్నారు. ఇప్ప‌టికే ఒక్కో పాఠ‌శాల‌కు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌యినందున‌, రెండో పాఠ‌శాల‌కు సంబంధించిన స్థ‌ల గుర్తింపు, సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై దృష్టి సారించాల‌ని సీఎం ఆదేశించారు.

Read Also:Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం నిర్మాణ న‌మూనాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప‌లు మార్పుల‌ను సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి హ‌రిత‌, జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Review Meeting
  • Educational Policy Telangana
  • Intermediate Dropouts
  • revanth reddy
  • School Infrastructure

తాజావార్తలు

  • Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం..

  • అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్‌.. పెళ్లి చేసుకోబోతున్నారా..?

  • Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్‌తో రెడ్‌మి 5G ఫోన్

  • Hardik Pandya: “నువ్వు గ్రేట్‌ రా బుడ్డొడా”.. వైభవ్‌ను చూడగానే ఓటమిని మరిచి ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions