CM Revanth Reddy : తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం
- మూసీనది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పాం
- సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదు
- ఎర్రవల్లి, మొయినాబాద్, జన్వాడ ఫాంహౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదు
- గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నాం. -సీఎం రేవంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వంలో యాదాద్రిగా మార్చారని, మేం వచ్చాక మళ్లీ ప్రజలంతా పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చామన్నారు. తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.
2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మూసీనది ప్రక్షాళన చేస్తామని ఆనాడే చెప్పామని, సబర్మతి, గంగా, యమున ప్రక్షాళన చేస్తున్నప్పుడు మూసీ ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎర్రవల్లి, మొయినాబాద్, జన్వాడ ఫాంహౌస్‌లు లాక్కుంటామని మేం అనడం లేదని, గోదావరి జలాలతో మూసీ ప్రక్షాళన చేస్తామనే అంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో మూసీ పక్కన ఉన్నవారి ఇళ్లను కూలుస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్నవారంతా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా నుంచి వచ్చినవారే అని ఆయన అన్నారు. వారికి వెయ్యి ఎకరాలు కేటాయిస్తామని చెప్పామని, 50 వేలు జేబులో లేని మందుల సామేల్‌ను 50వేల మెజార్టీతో నల్గొండ జిల్లా ప్రజలు గెలిపించారని సీఎం రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!