తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని సీఎం పార్టీ నేతలకు తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు. త్వరలో మార్కెట్, టెంపుల్ కమిటీల్లో నామినేషన్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించి జడ్‌పీటీసీ, జిల్లా అధ్యకుడిగా పని చేసి ఇప్పుడు మంత్రి అయ్యారు. భట్టి విక్రమార్క.. ఎన్‌ఎస్‌యూఐ నుంచి సీఎల్పీ నేతగా పని చేసి.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. షబ్బీర్ అలీ.. శాసన సభలోకి దూసుకెళ్లి ఆందోళనలు చేశారు.. ఆ తర్వాత.. ఎమ్మెల్యే, మంత్రి అయ్యి.. ఈ స్థాయికి వచ్చారు.
READ MORE: Amaravati Development: అమరావతి ఎలా ఉండాలి..? ప్రజల సలహాలు కోరిన సీఆర్డీఏ..
జగ్గారెడ్డి ఓడిపోయినా… నిర్మలా జగ్గారెడ్డిని కార్పొరేషన్ ఛైర్మన్ చేశామని.. అది జగ్గారెడ్డి కోటా కాదన్నారు.. పార్టీ కోటలోనే నిర్మలక్క ఛైర్మన్ అయ్యిందన్నారు. జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ప్రమోషన్ ఇవ్వలేదని తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న నిర్మలక్క ఛైర్మన్ అయ్యిందన్నారు. పార్టీ కోసం పని చేయని వాళ్లను ఎన్నికల ముందు బాధ్యతల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. రెండో సారి అధికారంలోకి రావడం మీ చేతిలోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. పదేళ్లు తన బాధ్యత అన్నారు. ఆ తర్వాత ఆ బాధ్యత మీరు తీసుకోవాలని సూచించారు. సీట్లు పెరుగబోతున్నాయి.. మహిళా సీట్లు పెరుగుతాయి.. సిద్ధంగా ఉండండి.. పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి.. మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. గ్రామాల్లో మనం చేసిన పనులు చర్చకు పెట్టండి. వివరాలు తీసుకోండి.. దానిపై చర్చ చేయండని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
READ MORE: CM Revanth Reddy: ఇది కరెక్ట్ కాదు.. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి..!
