CM Revanth Reddy : దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రూ.2 వేల కోట్లతో గడీ కట్టుకున్నారని కేసీఆర్‌పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చిన ప్రాంతాల్లో కేసీఆర్ ఓట్లు అడగాలని అన్నారు. ప్రజలే సరైన తీర్పు చెప్తారన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్‌దే కీలక పాత్ర అని చెబుతూ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, కాంగ్రెస్ గిరిజనుల పార్టీ అని అన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదని విమర్శిస్తూ, ప్రజలే ఫ్యూజ్, స్టార్టర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు.
Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
బీఆర్ఎస్ పాలన అసమర్థమని విమర్శించిన సీఎం, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10 కిలోమీటర్లు కూడా తవ్వలేకపోయారని మండిపడ్డారు. టన్నెల్ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందితే, బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. SLBCను పూర్తి చేస్తామని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని స్పష్టం చేసిన సీఎం, వచ్చే రోజుల్లో కూడా ప్రజాహిత కార్యక్రమాలే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని తెలిపారు. దేవరకొండ అభివృద్ధికి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ను దేవరకొండకు పంపిస్తానన్నారు. నర్సింగ్ కాలేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయండని, జూనియర్ కాలేజీ అభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేస్తానని సీఎం రేవంత్ అన్నారు.
10 ఏళ్లు నష్టపోయాం. 10 ఏళ్లు కష్టపడ్డాం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది.. రాష్ట్రాన్ని దేశంలోనే no 1 చేసి.. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తం చేస్తాం.. మంచి వాళ్ళను సర్పంచ్ గా ఎన్నుకోండి.. మంత్రితో కలిసి ఉండేవాళ్ళు, MLA తో కలిసి పని చేసే వాళ్లకు సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి. ఇందిరమ్మ చీరలను వాళ్ల ఇంటికే పంపిస్తా. ఇందిరమ్మ చీర కట్టుకోండి.. సర్పంచ్ కు ఓటేయండి.. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.