Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అనుకున్న తేదీల్లో షూటింగ్ లేట్ అవ్వడం, ఓటిటి బిజినెస్ క్లియర్ కాకపోవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా ఎన్నో కారణాలతో చాలా సినిమాలు వాయిదా పడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు డేట్ మార్చుకోవడం చాలా కామన్ విషయం. అయితే వాయిదా వేయాల్సి వస్తే.. కనీసం వారం, పది రోజులు ముందుగానే మేకర్స్ ప్రకటిస్తారు. కానీ ‘అఖండ 2’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అన్ని పనులు పూర్తి చేసి, కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ భారీ చిత్రం హఠాత్తుగా ఆగిపోయింది.
Also Read : The Raja Saab : ది రాజా సాబ్ OTT డీల్ ఫైనల్.. రికార్డు ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ!
Also Read
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని సంఘటన. సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నామని చెప్పినప్పటికీ, ఇండస్ట్రీ టాక్ ప్రకారం 14 రీల్స్ ప్లస్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య జరిగిన ఫైనాన్షియల్ వివాదాలే ఈ అడ్డంకికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అయితే ఇంతలోనే, తాజా సమాచారం ప్రకారం ‘అఖండ 2’ను డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీల్లో విడుదల చేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇదే సమయంలో, మరో ఆసక్తికర పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర నెలకొనబోతోంది. అదేంటంటే..
యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న ‘శంబాల’ చిత్రం ఇప్పటికే డిసెంబర్ 25న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఒకవేళ ‘అఖండ 2’ కూడా అదే తేదీన విడుదలైతే, బాక్సాఫీస్ వద్ద హాట్ పోటీ తప్పదన్నమాట. ఒక వైపు బాలకృష్ణ భారీ పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్, మరో వైపు ఆది సాయి కుమార్ కాన్సెప్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెలవుల సీజన్ మరింత ఆసక్తికరంగా మారుతుందా చూడాలి. లేదు అంటే ఆది సాయి కుమార్ టీమ్ తమ సినిమా డేట్ మార్చుకుంటారా? లేదా బాలయ్య సినిమా ముందు నేరుగా పోటీకి దిగి తమ నమ్మకాన్ని నిరూపించుకుంటారా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!