NTV Telugu Site icon

CM Revanth Reddy : ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడకు రావడం గొప్ప విషయమని, ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారని, మాటలు కాదు… చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యమన్నారు సీఎం రేవంత్‌.

Equatorial Guinea: సెక్స్ స్కామ్‌లో చిక్కుకున్న ఈక్వటోరియల్ గినియా ఆఫీసర్.. వైరల్ వీడియోల్లో ఎవరెవరున్నారంటే..!

ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారని, ఇందులో ఓసీలు-3076 (9.8%), ఈడబ్ల్యూఎస్- 2774 (8.8%), ఓబీసీలు-17,921(57.11%), ఎస్సీలు-4828 (15.3%), ఎస్టీలు-2783 (8.8%) అని ఆయన తెలిపారు. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన తెలిపారు. మనది రైజింగ్ తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యమన్నారు రేవంత్‌ రెడ్డి. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Somy Ali: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సంచలనం..

 

Show comments