NTV Telugu Site icon

CM Revanth Reddy : పార్లమెంట్‌లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారు… 

Cm Revanth Reddy

Cm Revanth Reddy

“Prophet for the World” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించిందన్నారు. గీత, బైబిల్, ఖురాన్ సారాంశం  ప్రపంచ శాంతి మాత్రమేనని, కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయని, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. గతంలో హైదరాబాద్ లో ఒక వైపు ఓవైసీ, మరో వైపు నేను ఎంపీగా ఉన్నామన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సార్లు కాంగ్రెస్ పై కూడా విమర్శలు చేసేవారని ఆయన అన్నారు. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలన్నారు. పార్లమెంట్ లో పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారని, కార్పొరేట్ రంగంలో, వ్యాపారాల్లో మన వాళ్లు అగ్రగామిగా ఎదుగుతున్నారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

House Collapsed: మీరట్‌లో కూలిన మూడంతస్తుల భవనం, శిథిలాల కింద 8 మంది..!

అంతేకాకుండా..’పేదల తరుపున మాట్లాడే నాయకులు క్రమంగా తగ్గిపోతున్నారు… పార్లమెంట్ లో పేదల కోసం మాట్లాడే వారిలో అసదుద్దీన్ ఓవైసీ ఒకరు.. ఎన్నికల ముగిసే వరకే రాజకీయాలు.. ఆ తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం అంతా కలిసి పనిచేయాలి… మజ్లిస్ పార్టీ నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నాం… అనేక ఏళ్ల నుంచి మూసీ నది మురికి కూపంలా మారింది.. మూసీ ప్రక్షాళన కోసం మజ్లిస్ సహకారం తీసుకుంటున్నాం… పేదలకు  డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నాం… దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిది.. ఒక మంచి మార్గంలో మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది…
కలిసిమెలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాం.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలను రెండు సార్లు గెలిపించారు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రెండోసారి అవకాశం వస్తుందని నమ్ముతున్న.. ఈ పదేళ్ల పాటు పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి

Bigg Boss Telugu 8: రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్.. బయటకు వచ్చేది ఎవరంటే?