NTV Telugu Site icon

CM Revanth: ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా.. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రారంభం

మరోవైపు.. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీకి ఆదేశాలు ఇచ్చారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని యోచిస్తున్నారు.

Read Also: Marriage Proposal: లైవ్ మ్యాచ్లో ఓ లేడీ క్రికెటర్కు అభిమాని పెళ్లి ప్రపోజల్.. ఫొటోలు వైరల్